పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్వో తాజాగా తన సబ్స్క్రైబర్లకు శుభ వార్తను అందించింది.. 2019-20 సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ అకౌంట్ వడ్డీ మొత్తాన్ని సబ్స్క్రైబర్ల పీఎఫ్ అకౌంట్లలో జమ చేయడాన్ని ప్రారంభించామని ఈపీఎఫ్వో తెలిపింది. 6 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లకు 8.5 శాతం వడ్డీని చెల్లిస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు వారి అకౌంట్లలో పీఎఫ్ వడ్డీ డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగుల వేతనం నుంచి 12 శాతం డబ్బులు పీఎఫ్ ఖాతాకు వెళ్లిపోతాయి.