ఇప్పుడు మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుంది.. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తు్న్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే వారికి ఊరట కలుగనుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం హోమ్ లోన్ తీసుకొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు మాత్రమే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంటుందని స్టేట్ బ్యాంక్ తెలిపింది. మార్చి 31 వరకు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకునే వారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు.. ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.