కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి)పై వడ్డీ రేట్లను సవరించింది. ఈ కొత్త ఎఫ్డీ రేట్లు ఈ ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వస్తాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. వేర్వేరు డిపాజిట్ కాలపరిమితిపై 2.50% నుండి 5.25% వరకు వడ్డీని అందిస్తుంది. రూ. 2 కోట్ల వరకు కనిష్టంగా 7 రోజుల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఎఫ్డీలను ఆఫర్ చేస్తుంది. 7 నుండి 30 రోజులు, 31 నుండి 90 రోజులు, 91 నుండి 179 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఎఫ్డిలపై వరుసగా 2.5%, 2.75%, 3.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఇక 180 రోజుల నుండి ఏడాది వరకు మెచ్యూరిటీ కలిగిన టర్మ్ డిపాజిట్లపై 4.40% వడ్డీని చెల్లిస్తుంది..