ఎస్బీఐ భిన్న రకాల వినియోగదారులకు అనేక హోం లోన్ స్కీమ్‌లను అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్బీఐ ప్రివిలెజ్ హోం లోమ్, డిఫెన్స్ ఉద్యోగులకు ఎస్బీఐ శౌర్య హోం లోన్, ఇతరులకు ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్ హోం లోన్, ఎస్బీఐ స్మార్ట్ హోమ్, టాపప్ లోన్, ఎస్బీఐ ఎన్ఆర్ఐ హోం లోన్, ఫ్లెక్సి పే హోం లోన్, ఎస్బీఐ హర్ ఘర్ హోం లోన్ ఇలా చాలా లోన్స్ ను వినియోగ దారులకు అందిస్తుంది.ఎస్బీఐలో వినియోగదారులు హోం లోన్ తీసుకోవాలంటే 7208933140 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. బ్యాంకు ప్రతినిధులు వినియోగదారులను సంప్రదించి లోన్లను వివరించి ఆఫర్ల గురించి తెలియజేస్తారు. ఇప్పటికే గృహ రుణ మార్కెట్లో ఎస్బీఐ వాటా 34 శాతం ఉండగా, రోజుకు వెయ్యి మందికి పైగా రుణాలను అందిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు.