అంత్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చాలా సంస్థలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐ కూడా మహిళా వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. రుణగ్రహీతలకు గృహ రుణ రేట్లపై వడ్డీపై మరింత తగ్గింపును ప్రకటించింది. మహిళా దినోత్సవం రోజున, మహిళా రుణగ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది, 6.70 శాతం నుంచి ప్రారంభం కానున్న వడ్డీ రేట్లపై ఇది వర్తిస్తుంది.