ఫ్లిప్కార్ట్ కూడా తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్కార్ట్ గ్రూపు ఉద్యోగులందరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్న ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు తాజాగా ప్రకటించింది. ముగ్గురు డిపెండెంట్లతో సహా ఫ్లిప్కార్ట్, మింత్రా ఉద్యోగులందరికీ కోవిడ్-19 టీకా ఖర్చును 100 శాతం చెల్లిస్తామని ఉద్యోగులకు అందించిన సమాచారంలో ఫ్లిప్కార్ట్ తెలిపింది. దీంతో పాటుగా టీకా తీసుకునేందుకు ఒక రోజు సెలవును కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.