కారు కొనాలనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది కూడా తక్కువ ధరకే కొనాలని భావిస్తారు.. ఇకపోతే ఎటువంటి కారు తక్కువ ధరకే వస్తుంది అనే విషయం తెలియదు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇక్కడ చూసేయండి.. భారత దేశ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేశారు.మారుతీ సుజుకీ ఎస్ ప్రెసో పేరుతో ఒక కారును అందిస్తోంది. ఇది స్మాల్ సైజ్ కారు అని చెప్పొచ్చు. అది మంచి మైలేజ్ అందిస్తుంది.