కొత్త పాలసీలను తీసుకొచ్చే ఎల్ఐసీ.. తాజాగా బచత్ ప్లస్ పేరిట కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారుడికి బీమా రక్షణతో పాటు పొదుపు కోసం దీన్ని రూపొందించింది. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్లో చేరిన పాలసీదారుడు హఠాత్తుగా మరణిస్తే, అతని కుటుంబానికి రెండు విధాలుగా పరిహారం చెల్లిస్తుంది. పాలసీ అమల్లో ఉన్న ఐదేళ్లలో మరణిస్తే.. నిబంధనల ప్రకారం ఒకేసారి పాలసీ విలువను చెల్లిస్తారు.అతని కుటుంబానికి పరిహారంతో పాటు లాయల్టీని కలిపి అందజేస్తారు. ఈ ప్లాన్లో చేరిన పాలసీదారుడు సింగిల్ ప్రీమియం విధానంలో ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు లేదా ఐదేళ్ల పాటు వాయిదాల్లో చెల్లించవచ్చు.