నెల నెలా మంత్లీ స్కీమ్ పేరుతో చాలా మంది కడుతున్నారు. నగల దుకాణాల యాజమాన్యాలు ఇలాంటి స్కీంలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.వీటిలో చాలా వరకూ ఒక సంవత్సరం నిడివి కలవి ఉన్నాయి. మంత్లీ చిట్ తరహాలోనే ఇందులో బంగారం కొనుగోలు చేయవచ్చు.ప్రస్తుతం మార్కెట్లోని ప్రముఖ జువెలరరీ దుకాణాలు అదిరిపోయే స్కీమ్స్ తో ముందకు వచ్చాయి. వీటిల్లో నెల నెల కొంత సొమ్మును ఈఎంఐ తరహాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తూ పోతే చివరకు మీరు కట్టిన డబ్బుకు బదులుగా బంగారపు వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాగే బంగారం తగ్గింపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది.