2017 లో ఈ వస్తు పన్ను వసూలు ను అమల్లోకి తీసుకువచ్చినా కూడా వరుసగా 5 నెలలు రూ.1 లక్ష కోట్లకు పైగా ఉండటం ఇదే మొదటిసారి. అలాగే, ఏ నెలలోనైనా అత్యధిక సేకరణ ఈ ఏడాది జనవరిలోనే ఉన్నది. జీఎస్టీ వసూళ్లు అక్టోబర్లో రూ.1.05 లక్షల కోట్లు, నవంబర్లో రూ.1.04 లక్షల కోట్లు, డిసెంబర్లో రూ.1.15, జనవరిలో రూ.1.19, ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లు వసూలయ్యాయి. మార్చిలో ఇప్పటివరకు ఈ సంఖ్య రూ.1.25 లక్షల కోట్లుగా తెలుస్తుంది. అయితే మరో వారంలో ఈ ఏడాది ఆర్ధిక సంవత్స రం ముగియనుంది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది ఈ మేరకు వసూళ్లలో సరికొత్త రికార్డును సృష్టించాలని జీఎస్టీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.