వివిధ పెట్టుబ‌డి మార్గాల్లో రాబ‌డులు త‌గ్గుతుండటంతో కొత్త మార్గాల‌ను పెట్టుబ‌డిదారులు అన్వేషించడం మొదలు పెట్టారు. ఈ క్ర‌మంలో మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వాళ్ళు  ఇన్వెస్ట్ చేసేందుకు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను సైతం ఆశ్ర‌యిస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఎక్క‌డో చ‌దివి, ఎవ‌రో చెప్పార‌ని ఏదో ఫండ్లలో డ‌బ్బులు పెట్టడం మొదలు పెడుతున్నారు. వాస్తవానికి ఇది మంచిది కాదు. నెమ్మ‌దిగా ఫండ్ల‌పై అవ‌గాహ‌న పెంచుకుంటూ పెట్టుబ‌డులు పెట్ట‌డం చాల మంచిది. 

 

ఈ నేపథ్యంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఉండే వివిధ ర‌కాల గురించి ఎప్పుడూ తెలుసుకుందామా మరి..ఈక్విటీ ఫండ్స్‌ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకుగాను పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌ అని పిలుస్తుంటారు. ఇవి రిస్కుతో కూడికున్నవనే చెప్పాలి. ఈ ఫండ్స్‌ వల్ల పెట్టుబడిదారుడికీ ఎక్కువ నష్టాలుకూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. 

 

ఇక మరొకటి డెట్‌ ఫండ్స్‌ ఓపెన్‌ ఎండెడ్‌ కేటగిరీ ఫండ్స్‌. అంటే ఈ ఫండ్స్‌ ఎప్పుడైనా ఎంతైనా ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం మనకు ఉంది. అలాగే ఎప్పుడైనా ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ను ఉపసంహరించుకునే అవకాశం కూడా మనకు ఉంది. అసలు కొన్ని డెట్‌ ఫండ్స్‌లో నష్టాలే రావు. ఇక ప్రభుత్వ సెక్యూరిటీస్‌, కార్పోరేట్‌, బ్యాంకులు విడుదల చేసే డెట్‌ స్కీములలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి డెట్‌ ఫండ్స్‌ అని కూడా పిలుస్తారు.

 

గిల్డ్‌ ఫండ్స్‌ అంటే సెక్యూరిటీ ఎక్కువుగా ఉండే ఫండ్స్‌ ఇది. గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌లో పెద్ద మొత్తంలో డబ్బును మదుపు చేస్తూ ఉంటారు. ఈ డబ్బును బ్యాంకింగ్‌ రంగంలో మదుపు చేయడంవల్ల పెట్టుబడి పెట్టిన డబ్బులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటే నమ్మండి.

 

ఇండెక్స్ ఫండ్ ఒక ప్రత్యేక సూచికలో తెలిపిన రీతిని ప్రతిబింబిస్తాయి. అంటే బిఎస్ ఇ సెన్సిటివ్ ఇండెక్స్, ఎస్ &పి ఎన్ఎస్ఈ 50 ఇండెక్స్ మొదలైన వాటిలాగానే లభిస్తాయి అందరికి. ఈ పథకాలు ఒక సూచికలో పేర్కొన్న వాటికి గుర్తింపునిస్తూ వాటి సెక్యూరిటీల్లో మదుపు చేస్తూ ఉంటాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో  ఇన్వెస్ట్ చేసే ముందు పై వాటిని అన్నిటినీ చదువుకొని ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: