నేడు సమాజంలో బ్రతుకు బండి రిటైర్ అయిన తరువాత కూడా లగాల్సిన పరిస్థితి వచ్చేసింది. కరోనా తెచ్చిపెట్టిన సంక్షోభం ఈ స్థితిని మరింత  జఠిలం చేసింది. మరోపక్క దేశంలో పెరిగిపోతున్న ఇంధన ధరల నేపథ్యంలో కూడా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనితో సామాన్యుల బ్రతుకు మరింత దిగజారిపోతోంది. కరోనా తో ఉన్న ఉద్యోగాలు ఊడిపోయిన సందర్భంలో ఆయా వర్గాల వద్ద ఆర్థిక స్థిరత్వం లేక అనేక ఇబ్బందులు పడ్డ విషయం చూశాం. మరోసారి ఆ పరిస్థితి రాకుండా అందరు కాస్త జాగర్తలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఉన్నదానికో కాస్త పొదుపు చేసుకోవాలని ఆలోచనలు ఈ సమయంలో ఎక్కువ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక పొదుపు సంస్థలవైపు వీరు చూస్తున్నారు. అయితే సాంప్రదాయకమైన పొదుపు విధానాలు అంటే బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ లు, పోస్ట్ ఆఫీస్ లలో పొదుపు ఖాతాలు, పెన్షన్ స్కీమ్స్ లాంటి అనేక విధానాలవైపు ప్రజలు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయా ఆర్థిక సంస్థలు కూడా ప్రజలను ఆకర్షించడానికి తగిన స్కీమ్స్ లతో సిద్ధం అవుతున్నారు. అలాగే కేంద్రం మార్గదర్శకాల మేరకు భారత్ లో ఇళ్ల కోసం లోన్ వైపు చుసిన వారికీ కూడా వడ్డీ రేట్లు భారీగా తగ్గించేశాయి ఆయా బ్యాంకులు. దీనితో రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ సంస్థలలో కూడా పెట్టుబడులు పెట్టుకునేందుకు తగిన మార్గదర్శకాలు కూడా కేంద్రం తీసుకువచ్చింది. ఇలా భవిష్యత్తుకోసం అనేక పద్దతుల ద్వారా ప్రజలు తమ వద్ద ఉన్న చిన్న మొత్తాలతోనే పొదుపు చేసుకోవాలని, ఆయా పొదుపు విధానాలు రూపొందిస్తున్నారు.

తాజాగా ఇదే తరహా స్కీం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా 30 ఏళ్ళ పాటు ప్రతి నెల 12వేలు పొదుపు చేసుకోవడం వలన మెచ్యూరిటీ అనంతరం నెల నెల లక్షన్నరపైగా పెన్షన్ వచ్చే విధంగా దీనిని రూపొందించారు. ఇది ప్రభుత్వ స్కీం, పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ నిర్వహిస్తున్న నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా పొందవచ్చు. అయితే ఇందులో మెచ్యూరిటీ మొత్తంలో 40-100 శాతం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కీం లో 30 ఏళ్లపాటు నెలకు 12వేలు పొదుపు చేసుకుంటే, నెలనెలా 1.78 లక్షల పెన్షన్ పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో చేతికి 60 శాతం ఇస్తారు. అంటే 1.64 కోట్లు, మిగిలినవి 40 శాతం అంటే 1.04 కోట్లు యాన్యుటీ ప్లాన్ లో పెట్టాల్సి ఉంటుంది. దీనివలన నెలకు 54700 పెన్షన్ వస్తుంది. 60శాతం సిస్టమాటిక్ విత్ డ్రా ప్లాన్ లో 25 ఏళ్ళ కాలపరిమితిలో పెట్టాల్సి ఉంటుంది. దీనితో 1.23 లక్ష నెలకు చేతికి వస్తుంది. అంటే మొత్తం 1.7 లక్షలు పెన్షన్ వచ్చినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: