ప్రస్తుతం ఎటు చూసినా, ఎటు తిరిగినా ఎక్కువ సార్లు వినపడే పదం జీఎస్టీ. ఇండియాలో వ్యాపారం చేస్తున్న చాలా మంది వ్యక్తులు జీఎస్టీ నంబర్‌ను కలిగి ఉన్నారు అలాగే వినియోగిస్తున్నారు. అయితే నేటికీ చాలా మందికి తాము కొనే అలాగే అమ్మే చాలా వస్తువులపై జీఎస్టీ ఉంటుందని తెలియదు. అయితే ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ పరిధిలోకి రాకుండా చేసింది. పెట్రోలు మరియు డీజిల్‌ వంటి కొన్ని వస్తువులకు జీఎస్టీ మినహయించింది గవర్నమెంట్. కాగా జీఎస్టీ ని వసూలు చేయడం కోసం కొన్ని నియమాలు మరియు నిబంధనలు రచించింది ప్రభుత్వం. ప్రజలందరూ కూడా వీటికి లోబడి వీటిని అనుసరించడం చాలా అవసరం. ముఖ్యంగా చిన్న చితక వ్యాపారదారులు కూడా ఈ వివరాలను తెలిసుకొని ఉండటం మంచిది.

మీరు ఒకవేళ చిరు వ్యాపారస్తులు అయితే మీ వద్ద జీఎస్టీ నంబర్ లేని పక్షంలో మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ప్రతి వ్యాపారస్తుడు జీఎస్టీ కి సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.  ఇపుడు వాటికి సంబందించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. జీఎస్టీ నంబర్ ను కలిగిన వ్యాపారస్తులు వారు వారి వ్యాపారం ద్వారా జీఎస్టీ ని సేకరించి ప్రభుత్వానికి కొంత జమ చేస్తారు. కానీ ఏ వ్యాపారస్తులు అయితే  జీఎస్టీ నంబర్ ను కలిగి ఉండరో అటువంటి వారు జీఎస్టీ నంబర్ ఉన్న వారి నుంచి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ అవే వస్తువులను మీరు ఇతరులకు విక్రయించినపుడు ఆ వస్తువులపై జీఎస్టీ ని వసూలు చేయలేరు అనగా మీరు చెల్లించిన మొత్తాన్ని సైతం పొందలేరు. అదే జీఎస్టీ నంబర్ మీ వద్ద ఉన్నట్లైతే ఈ నష్టం నుండి తప్పించుకోవచ్చు.

మీ వద్ద జిఎస్ టి నెంబర్ ఉన్నట్లయితే వస్తువులను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన జీఎస్టీని అదే వస్తువులు విక్రయించిన ప్పుడు తిరిగి ఆ జీఎస్టీ ని వసూలు చేసుకోవచ్చు. అయితే 20 లక్షలకు మించి వ్యాపారం ఉన్నటువంటి వ్యాపారికి జీఎస్టీ నంబర్ తప్పనిసరి. 20 లక్షలకు మించి వ్యాపారం ఉన్న వ్యాపారస్తులు ఖచ్చితంగా జీఎస్టీ నెంబర్ ను తీసుకోవాలి లేదంటే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోబడతాయి. కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని చేయాలి అనుకుంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: