వేసవికాలంలో ఎండలు ఎంతగా దంచి కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఎండలను చూసి అటు జనాలు బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం దంచి కొడుతున్న ఎండలకు బండలు సైతం పగిలిపోతున్నాయేమో అనే సందేహం అందరిలో కలుగుతుంది. ఉదయం 6 గంటలకే  ఏకంగా 12 గంటలు అవుతుందేమో అనేంతలా ఎండ వేడిమి ఉంటుంది. దీంతో ఇక ఎండ నుంచి జాగ్రత్త పడుతూనే ఏదైనా పని ఉంటే బయటికి వెళ్తున్నారు జనాలు. మరి కొంతమంది కేవలం అర్జెంట్ పని అయితేనే ఇంటి నుంచి కాలు బయట పెడుతున్నారు తప్ప లేదంటే ఎండకు భయపడి ఇంట్లో నుంచి కూడా బయటకు రావట్లేదు.



 అయితే ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో.. ఉపశమనం కోసం ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉంటారు జనాలు. ఈ క్రమంలోనే దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్ కి వెళ్లడం లేదంటే దగ్గర్లో ఉన్న చెరువులోకి వెళ్లి కాసేపు సరదాగా ఈత కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఎండాకాలంలో ఉపశమనం కోసం ఇలా చేయడమే చివరికి ఎంతోమంది ప్రాణాల మీదికి తెస్తుంది అని చెప్పాలి. సరదా కోసం చెరువులు కుంటల్లో ఈతకు వెళ్తూ చివరికి నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి.



 ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటనే జరిగింది. మెదక్ జిల్లాలో కేవలం నిన్న ఒక్కరోజే ఈత సరదా కారణంగా ఏకంగా ఐదుగురు మృతి చెందారు. చేగుంట మండలం వడియారానికి చెందిన మల్లేశం (48) యాదగిరి (40) రాయపోలు మండలం కొత్తపల్లికి చెందిన కృష్ణ రంగంపేట వాసి భూమయ్య గజ్వేల్ మండలం ధర్మ రెడ్డిపల్లి కు చెందిన అంజలి  ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఇలా వేసవిలో ఉపశమనం కోసం చేస్తున్న పని కాస్త చివరికి ప్రాణాలు పోయే పరిస్థితిని తెస్తుంది. ఈత సరదా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: