రుచికరమైన కంది పొడి తయారీ విధానం..పొయ్యిమీద బాణలి పెట్టి మొదట కందిపప్పును, కాసేపటి తర్వాత పుట్నాల పప్పును వేసి చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలి.బాణలిలో స్పూన్ నూనె వేసి..అందులో జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు.. చివరగా వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. సన్నని మంట మీద మాత్రమే వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.  బాగా వేగాక ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి..సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి వేయించుకుని పెట్టుకున్న కందిపప్పు, పుట్నాల పప్పు జతచేసి పొడిగా అయ్యేవరకు మిక్సీ చేసుకోవాలి.కందిపప్పుతోపాటు, కందులు కూడా కలిపి వాడితే మరింత రుచిని ఆస్వాదిస్తారు. ఈ పొడిని ఇడ్లీతోపాటు ఇతర టిఫిన్లతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.