అంబలి తయారుచేసే విధానం....ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి.. రాగిపిండి కలిపి ఉండల్లేకుండా గిలక్కొట్టాలి. అందులోనే బియ్యప్పిండి, సజ్జపిండి, జొన్నపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. అవి బాగా వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో వేయాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. కాస్త చిక్కగా మారాక స్టవ్ కట్టేయాలి. దీనికి వేసవి కాలంలో రోజుకు రెండు సార్లు తింటే చాలా మంచిది. అందులో కాస్త మజ్జిగ కలుపుకుని తాగితే ఇంకా బాగుంటుంది.