మష్రూం ఆమ్లెట్ తయారు చేయు విధానం....ముందుగా పుట్టగొడుగులను సన్నగా తురుము కోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి... కాస్త నూనె వేసి పుట్టగొడుగుల తురుమును వేయించి దించేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడి గుడ్లను పగుల గొట్టి, అందులో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కాస్త ఉప్పు, వేయించిన పుట్టగొడుగుల ముక్కులు వేసి బాగా గిలక్కొట్టాలి. అందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి... కాస్త నూనె రాసి ఆ మిశ్రమాన్ని ఆమ్లెట్ వేసుకోవాలి. రెండు వైపులా కాల్చాక స్టవ్ కట్టేయాలి. మష్రూం ఆమ్లెట్ ను పిల్లలకు పెడితే మంచి పోషకాలు అందుతాయి.