ప్రేమించుకున్న అంత కాలం బాగానే ఉండి, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు విడిపోయి ఎవరిదారి వాళ్ళు చూసుకుంటారు.అంతేకాదు వారికి నచ్చిన వారితో పెళ్లి కూడా చేసుకుంటారు.అసలు విషయానికొస్తే.. ఓ యువతి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కు బాడీ గార్డ్ లతో వెళ్లి షాక్ ఇచ్చింది. తనను పెండ్లి చేసుకుంటానని చెప్పి లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపించింది. దీంతో ఆ ఎంగేజ్మెంట్తో పాటు మరునాడు జరుగాల్సిన పెండ్లి కూడా రద్దయ్యాయి. సినిమాను తలపించిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.