బిహార్లోని బగహ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది..పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు మార్చి 14న బెటా నుంచి వెళ్లిన యువతి ఆపై ఇంటికి తిరిగిరాలేదు. యువతి చివరిసారిగా ఆదివారం రాత్రి 8 గంటలకు పరీక్ష రాసి ఆటోలో ఇంటికి తిరిగివస్తూ తమతో మాట్లాడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిగంటల తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ అయిందని, అర్ధరాత్రి దాటినా యువతి ఇంటికి చేరుకోకపోవడంతో మరుసటి రోజు ఉదయం కుటుంబసభ్యులు చితహ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.