అత్తా, కోడళ్ల మధ్య గొడవలు రావడం సహజం.. కొన్ని గొడవలు కుటుంబాన్ని చీల్చితే , మరి కొన్ని ప్రాణాలను కూడా తీస్తాయి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు.. కానీ ఇప్పుడు వెలుగు చూసినా ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అత్త అన్నం పెట్టలేదని కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోరఖ్పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఇక ఈ విషయం తెలిసిన వారంత ఒకప్పుడు అత్తలకు కోడళ్లు సపర్యలు చేయడం చుశాము కానీ ఇలా అత్త తనకు సేవలు చేయడం లేదని కోడలు ఫిర్యాదు చేయడమెంటని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు.