మహిళలకు రక్షణ ఎక్కడా లేదు.. ఆఖరికి ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. సొంతవాళ్లే రాబందులు లాగా పీక్కుతింటున్నారు.. కట్టుకున్న భర్త కూడా భార్యకు వ్యతిరేఖంగా మారుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలను లోబరుచుకుని వారిపై అశ్లీల వీడియోలను రికార్డు చేస్తున్న భర్తను వారించింనందుకు తనపై సామూహిక లైంగిక దాడి జరిపారని ఓ వ్యక్తిపై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేసిన ఘటన యూపీలోని మీరట్లో వెలుగుచూసింది. తన భర్త మహిళలను లోబరుచుకుని వారిని బెదిరించేందుకు అసభ్య వీడియోలను రికార్డు చేస్తున్నాడని మహిళ పోలీసులను ఆశ్రయించారు.