సాధారణంగా ప్రియుడు ప్రేయసిని చంపేసిన ఘటనలు చూస్తుంటాం. ప్రేయసి ప్రియుడిని చంపేసిన ఘటనలు చాలా అరుదు. అలా చేయాలంటే ప్రియురాలికి మరో వ్యక్తి సాయం అవసరం. ఒంటిరిగా ప్రియురాలే ప్రియుడిని చంపేసిన ఘటనలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనే తాజాగా పశ్చిమ
గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఓ వైపు ప్రియుడు పెళ్లికి నిరాకరించాడనే కోపం మరో వైపు వేరొకరిని ప్రేమిస్తున్నాడన్న అనుమానం ఈ దారుణానికి కారణమయింది.
ఇక వివరాలు చూస్తే... పశ్చిమ
గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి
పావని అనే యువతి
తాడేపల్లి గూడెంలోని పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీ నాయుడు (25) ప్రేమించుకుంటున్నారు. గత రెండేళ్లుగా వీరి మధ్య
ప్రేమ కొనసాగుతోంది. అయితే తాతాజీని ప్రాణంగా ప్రేమించిన
పావని తనను
పెళ్లి చేసుకోవాలని కోరింది. గత ఏడాది కాలంగా
పెళ్లి చేసుకోవాలని అడుగుతోంది. అయితే తాతాజీ మాత్రం అడిగిన ప్రతి సారి మాట దాటవేస్తున్నాడు.
ఈ క్రమంలో వారు సోమవారం కొవ్వూరు మండలం పంగిడి వద్ద కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. తాతాజీ తన
బైక్ పై పంగిడి వెళ్ళగా... మలకపల్లి నుంచి
పావని కూడా అక్కడికి చేరుకుంది. ఇక రాత్రి వరకు వారు సరదాగా గడిపారు. ఇక పావనిని
బైక్ పై ఎక్కించుకున్న తాతాజీ ఆమెను దింపడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో
బైక్ పై వెనుక కూర్చున్న
పావని బైక్ కొవ్వూరు మండలం ధర్మవరం- కాపవరం మధ్య రాగానే తన బ్యాగులోని
కత్తి తీసి అతని వీపుపై పొడిచింది. ఇక మరింత రెచ్చిపోయిన
పావని తాతాజీ మెడ, తల, వీపుపై పొడవడంతో అతడు అక్కడిక్కడే పడిపోయాడు. కొద్ది సేపు తర్వాత అక్కడే చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును ఛేదించారు. తాతాజీని చంపింది ప్రియురాలే అని నిర్ధారించారు.