వంట విషయంలో రూమ్మేట్ ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ కాస్త ఏకంగా కత్తులతో దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక హెచ్ పి రోడ్ కాలనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైతాస్ అలీ, ఫిరోజ్ ఒకే గదిలో ఉంటున్నారు. వీరిద్దరూ గత ఆరు నెలల నుంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఇక మంగళవారం రాత్రి సమయంలో ఇద్దరూ రూమ్కు వచ్చారూ. దీంతో వంట చేసేందుకు కూరగాయలు కట్ చేసి ఇవ్వాలి అటు మైతాస్ అలీ కోరగా ఫిరోజ్ మాత్రం అతని మాటలు పట్టించుకోలేదు. దీంతో మైతాస్ అలీ ఆగ్రహంతో ఊగిపోయాడు
కూరగాయలు కట్ చేసే కత్తి తో ఫిరోజ్ పై దాడికి దిగాడు. అయితే ఫిరోజ్ ఊహించని దాడి జరగడంతో తేరుకోలేక పోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో రక్తపు మడుగులో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఫిరోజ్ ను గమనించిన స్థానికులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మైతాస్ అలీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి