హైదరాబాద్‌ లోని ప్రగతి నగర్ లోజరిగిన కిరణ్ భార్య సుధారాణి హత్య కేస్ లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అనుమానం తో పెళ్ళైన 28 రోజులు భార్య ను కిరతంగా హత్య చేశాడు భర్త కిరణ్.  అనంతరం గొంతు కోసుకున్నాడు నిందితుడు కిరణ్.   ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  కిరణ్ పరిస్థితి విషమం గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.  గత కొద్ది రోజులుగా భార్యను వేదిస్తున్నాడు కిరణ్. భార్య కు వేరే వ్యక్తి తో అక్రమ సంబంధం ఉందంటూ...  టార్చర్‌ పెట్టాడు భర్త కిరణ్‌.  భర్త కిరణ్‌ వేధింపులు తాళ లేక  తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది బాధితురాలు. 

ఈ నేపథ్యం లోనే ప్రగతి నగర్‌ వచ్చారు బాధితురాలి తల్లిదండ్రులు. బాధితురాలి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు..  తమ కూతురు ఎంత సేపటి కీ తలుపులు తీయకపోవడం తో..  ఆ ఇంటి దర్వాజాను బద్ధలు కొట్టారు.  ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూస్తే.... రక్తపు మడుగులో కనిపించింది కన్న కూతురు.  ఇక అదే గది లో బాత్రూం లో గొంతు కొసుకున్నాడు  భర్త కిరణ్.  దీంతో భర్త కిరణ్ ను హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. గత నాలుగు నెలల క్రితమే రోడ్ ప్రమాదం లో తమ కుమారుడికి తల కు దెబ్బ తగిలింది అంటున్నారు కిరణ్ తల్లిదండ్రులు.

ఈ ఘటన తెలియగానే... పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ప్రస్తుతం ఈ కేసు పై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  కాగా... సుధారాణి హత్య ఘటన కామారెడ్డిలో కలకలం సృష్టించింది. ఆమె సొంతూరు తిమ్మాపూర్ నుంచి... 300 మంది భర్త కిరణ్ కుమార్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రుల బాధతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు, బంధువులు ఇంటి గేటును తోసుకుని  వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమను అడ్డుకుంటున్నందుకు ఆగ్రహంతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను బయటకు లాగేసారు. కొందరు మహిళలు రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: