ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆడ‌వారిపై రోజు రోజుకు అరాచ‌కాలు మితిమీరిపోతున్నాయి.  చుట్టూ ప‌దుల సంఖ్య‌లో జ‌నాలు ఉన్నారు. రైలులోనే ప్ర‌యాణిస్తున్నారు. అయినా ఆకృత్యాలు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా అగ్ర‌రాజ్య‌మైన అమెరికాలో కూడ ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఎవ‌రూ లేని నిర్మానుష్య ప్రాంతాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కానీ అంద‌రూ చూస్తుండ‌గానే పెన్సిల్వినియాలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు.

ఆ మ‌హిళా చుట్టూ ఉన్న ప్ర‌యాణికులు చూస్తున్నారు కానీ  అత‌ని అకృత్యాల‌ను ఆప‌డానికి ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌లేదు. ఆ మ‌హిళా కాపాడండి అని మొర‌పెట్టుకున్నా ప‌ట్టించుకునే వారు లేరు. చుట్టూ ప్ర‌యాణికులు ఉన్న‌ప్ప‌టికీ అత్యాచారానికి గుర‌వుతున్న మ‌హిళ‌ను కాపాడ‌క‌పోవ‌డం సిగ్గు చేటు. త‌న‌పై జ‌రుగుతున్న అత్యాచారం క‌న్నా ప్ర‌జ‌ల నిస్స‌హాయ‌త బాధితురాలు బాధిస్తుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. అమెరికాలోని మార్కెట్ ప్రాంక్‌ఫోర్ట్ లైన్‌లో బాధితురాలు ప్ర‌యాణం చేస్తోంది. నిందితుడు ఫిస్ట‌న్ ఎన్‌గోయ్ కూడ ఆ రైలులోనే ప్ర‌యాణించాడు. అప్పుడు స‌మ‌యం రాత్రి 10 అయింది. చీక‌టిగా ఉండ‌డం అదునుగా భావించాడు. ఆ మ‌హిళ ప‌క్క‌నే కూర్చుని ఉన్న ఎన్‌గోయ్ మెల్ల‌గా మ‌హిళ‌పై చేయి వేశాడు. అప్పుడు ఆ మ‌హిళ నిద్ర పోయి ఉండ‌డంతో గ‌మ‌నించ‌లేదు.

ఇది అదునుగా భావించి ఆమెను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తాకి అస‌భ్య‌క‌రంగా వేధించ‌డం ప్రారంభించాడు. వెంట‌నే ఆ మ‌హిళ ప్ర‌తిఘ‌టించింది. అయినా ప‌ట్టించుకోలేదు. అత‌ని తీరు మార్చుకోలేదు. మ‌ర‌ల తిరిగి రెచ్చిపోయాడు. అత‌ను చేస్తున్న అస‌భ్య‌క‌ర‌మైన ప‌నుల‌ను రైలులో ప్ర‌యాణికులు గ‌మ‌నిస్తున్నా ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌లేదు. క‌నీసం మ‌హిళ‌ను కాపాడ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇది అదునుగా భావించి నిందితుడు విచ్ఛ‌ల‌విడిగా రెచ్చిపోయాడు. అంద‌రి ముంద‌ర ఆ మ‌హిళ‌ను అత్యాచారం చేశాడు. క‌నీసం ఎవ‌రైనా అడ్డుకొని ఉంటే ఈ ఘాతుకం జ‌రిగేది కాదు. అది లేకుంటే ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్‌కైనా ఫోన్ చేస్తే ఆ మ‌హిళ పై జ‌రిగిన ఘోరం ఆగి ఉండేది.  


మరింత సమాచారం తెలుసుకోండి: