ఇటీవలే హైదరాబాద్ నడిబొడ్డున  ఏకంగా గుర్తు తెలియని మృతదేహం వాటర్ ట్యాంక్ లో లభ్యం కావడం కలకలం సృష్టించింది. ముషీరాబాద్ హరీనగర్ రీసాలా గడ్డ వాటర్ ట్యాంకులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. అయితే వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడానికి వచ్చి మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సిబ్బంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ నుండి బయటకు తీసారూ. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ పలు ఆధారాలను సేకరించారు.


 ఈ కేసును పోలీసులు ఎంతో సవాల్గా తీసుకున్నారు అని చెప్పాలి.. దీంతో పలు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు చివరికి రిసాలా గడ్డ వాటర్ ట్యాంకులో లభ్యమైన మృతదేహం కేసులో చిక్కుముడి వీడింది. వాటర్ ట్యాంకులో లభ్యమైన మృతదేహం కిషోర్ అనే యువకుడిదిగా గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలోనే ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ ట్యాంకులో లభించిన యువకుడి మృతదేహంపై దెబ్బలు చూస్తే హత్య చేసి ఉండవచ్చు అని అటు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో ఉండే కిషోర్ యువకుడి మృతదేహం గా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గొడవ పడి కిషోర్ అనే యువకుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఘటనా స్థలంలో లభించిన చెప్పులు మృతుడు ఎడమ చేతి పై ఉన్న టాటూ ఆధారంగా ఇక మృతదేహం కిషోర్ దే అన్న నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే ఆ యువకుడికి మద్యం సేవించే అలవాటు ఉందని సభ్యులు తెలిపారు. ఇక పోస్టుమార్టం అనంతరం కిషోర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు  పోలీసులు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: