ఇటీవలి కాలంలో సినిమాల ప్రభావం జనాల పై ఎంతో ఎక్కువగానే ఉంటుంది. అయితే సినిమాల్లో ఉన్న  మంచిని గ్రహించడం కంటే చెడును పాలో అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు నేటి రోజులలో జనాలు. ఇలా సినిమాల్లో చూసి ఎన్నో నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొన్ని   సినిమాలలో నేరస్తులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చిత్రవిచిత్రమైన ప్లాన్లు వేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ప్లాన్స్ కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యం అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మేమేం తక్కువ అనుకుంటున్నారో ఏమో ఎంతో మంది అక్రమార్కులు ఇలా సినిమాల్లో నేరస్తులు చేసినవే చేస్తూ పోలీసులకు షాక్ తిన్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవలే అచ్చం పుష్ప సినిమా తరహాలోనే ఒక వ్యాన్ లో కింద ఒక పెద్ద అర ఏర్పాటు చేసి ఇక పైన ఎప్పటిలాగానే ఆయిల్ డ్రమ్ములు పెట్టి నిషేధిత గుట్కా నాటుసారా తరలిస్తూ ఏపీ పోలీసులకు కొంతమంది కేటుగాళ్లు చిక్కిన ఘటన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి... ఇటీవలి కాలంలో ఇతర దేశాల నుంచి డ్రగ్స్ రవాణా చేయడానికి ఎంతోమంది వినూత్నమైన ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ మహిళ అచ్చం హీరో సూర్య వీడొక్కడే సినిమా లో తరహాలోనే ప్లాన్ వేసి పోలీసులకు మస్కా కొట్టాలని ప్రయత్నించింది గానీ చివరికి దొరికిపోయింది.


 సూర్య వీడొక్కడే సినిమా లో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు డ్రగ్స్ ఉండలుగా చేసి కడుపులో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. తద్వారా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటారు. ఇక్కడ ఉగాండా కు చెందిన ఓ మహిళ సుమారు ఒక కిలో బరువున్న ఒక కోకైనా పదార్థాన్ని కడుపులో దాచిపెట్టింది.  అయితే మహిళల ప్రవర్తనతో అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఇక కోకైన్ మింగినట్లు చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి డ్రగ్స్ ని బయటకు తీశారు. దాదాపు 992 గ్రాముల బరువున్న ఈ క్యాప్సిల్స్ ను బయటకు తీశారు. దీని విలువ 14 కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఇక సదరు మహిళ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: