ప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం. ప్రతి ఒక్కరిలో ఎన్నో తీపి జ్ఞాపకాలకు కారణం అవుతుంది ప్రేమ.  కానీ నేటి రోజుల్లో ప్రేమ అనేది ఒక కమర్షియల్ పదం గా మారిపోయింది. ఎంతోమంది తమ అవసరాలను తీర్చుకోవడానికి ప్రేమ అనే ముసుగు వేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ప్రేమ పేరుతో యువతులను మాయ మాటలతో నమ్మించి దగ్గరవుతున్నారు. ఆ తర్వాత శారీరక వాంఛలు తీర్చుకుని నడిరోడ్డు మీద వదిలేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇటీవలి కాలంలో ఎంతోమంది యువకులు నువ్వే ప్రాణం.. నువ్వు లేకుండా బ్రతకలేను.. పెళ్ళి చేసుకుని హాయిగా ఉందాం అంటూ మాయమాటలు చెప్పి ఎంతో మంది యువతులను ప్రేమలోకి దింపి అవసరాలు తీర్చుకుని నడిరోడ్డు మీద వదిలేస్తున్నారు. దీంతో ఎంతో అమ్మాయిలు న్యాయ పోరాటం చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు మోసం చేశాడు అంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం లో వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఆపరేటర్ గా పని చేస్తున్న యువతి మేడ్చల్లోని హాస్టల్లో ఉంటోంది.


 అయితే ఆ యువతికి నాలుగేళ్ల క్రితం శంకరంపేట మండలంకు చెందిన రాజేంద్రప్రసాద్ తో పరిచయం ఏర్పడగా.. పరిచయం ప్రేమగా మారి పోయింది.  వివాహం చేసుకుంటాను అంటూ నమ్మబలికిన యువకుడు శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. అంతేకాదు ఫోటోలు వీడియోలు కూడా తీశాడు. అయితే పెళ్లి గురించి ఆ యువతి ప్రశ్నించినపుడల్లా మాట దాటవేస్తూ వచ్చేవాడు యువకుడు. ఇక ఓసారి యువతి నిలదీయడంతో ' నేను నిన్ను పెళ్లి చేసుకోను.. అలాగే నువ్వు కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీలులేదు.. నా మాట కాదని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నా దగ్గర ఉన్న నీ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో పెట్టేస్తా అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.  దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: