మైసూరు విజయనగర పరిధిలో ఆస్తి కోసం ఓ కొడుకు కన్న తండ్రిని ఎయిర్ గన్‌తో షూట్ చేసి పరారైన సంఘటన కలకలం రేపింది. రేణుకా కళాశాలకు చెందిన ఆస్తి విషయంలో గత నెల రోజుల నుండి తండ్రి శివకుమార్, కొడుకు మధ్య ఘర్షణ జరుగుతోంది. కాగా ఆస్తిని తన పేరు మీద రాయాలని ఒత్తిడి తెస్తూ వున్నాడు. అయినా సదరు తండ్రి కొడుక్కి బాధ్యత తెలియదని గ్రహించి ససేమిరా అన్నాడు. అయితే ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలని భావించిన కొడుకు తన స్నేహితులతో కలసి తండ్రి పై దాడికి దిగిన ఆ కొడుకు ఆ వివాదంలో తండ్రి పై ఎయిర్ గన్ తో కాల్పులు జరిపి తన ఫ్రెండ్స్ తో కలిసి పరారయ్యాడు.
ఆ శబ్దాలకు చుట్టు పక్కల వారు వచ్చి చూడగా గాయపడిన ఆ తండ్రిని చూసి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కొడుకు అతడి స్నేహితులు పరారీలో ఉండగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు . ఈయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. ఇలా ఈ ఆస్తుల కోసం కన్న తండ్రిని కడతేర్చాలని చూసిన కొడుకులు ఉన్నా లేకున్నా ఉపయోగం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి