
ఇలా ఇటీవలి కాలంలో దేశంలో ఎక్కడో ఓ చోట తరచూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇలా బలవన్మరణానికి పాల్పడటానికి గల కారణాలు తెలిసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇంత చిన్న కారణానికి కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటారా అని ప్రతి ఒక్కరూ అవాక్కయ్యే దుస్థితి ప్రస్తుత రోజుల్లో ఉంది అని చెప్పాలి. ఇలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు బాలికలు ఒకేసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ ఘటన కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వారిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా మరో ముగ్గురు బాలికలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. ఈ ఘటన బీహార్లోని ఔరంగాబాద్ లో వెలుగులోకి వచ్చింది. అయితే ఇలా ఆత్మహత్యాయత్నం చేసిన వారిలో ఒక బాలిక తన ప్రేమను స్నేహితురాళ్ల ద్వారా ఓ యువకుడికి తెలియజేసిందని.. అయితే ఆ బాలిక ప్రేమకు యువకుడు ఒప్పుకోలేదని దీంతో ఇక అందరూ బాధలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..