
ఇక్కడ కొంతమంది వ్యక్తులు పుట్టగొడుగులు ఎంతో ఇష్టంగా తిన్నారు. కానీ అలా పుట్టగొడుగులు తినడమే చివరికి ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అన్నది మాత్రం ఊహించలేకపోయారు. పుట్టగొడుగులు తిన్న కారణంగా ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆసుపత్రిలో చేరి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటన కాస్త ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అసోంలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.
దిబ్రూగఢ్ లో కొంతమంది వ్యక్తులు పుట్టగొడుగులను ఎప్పటిలాగానే తిన్నారు. కానీ అది విషపూరితమైనవి గమనించలేదు. దీంతో 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పుట్టగొడుగులు తిన్న కాసేపటికే 13 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం మరో 39 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. ఇలా విషపు పుట్టగొడుగులు తిన్నవారిలో చాలామందికి కిడ్నీ లివర్ సమస్యలు తలెత్తుతాయని వైద్య పరీక్షల్లో నిర్థారణ అయింది. సంచలనంగా మారిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..