ఇటీవలి కాలంలో దారుణ హత్యలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలా హత్యలు చేయడానికి గల కారణాలు తెలిసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి చిన్న కారణాలకు కూడా ఏకంగా ఓ మనిషి ప్రాణాలు తీస్తారా అని ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. సభ్య సమాజం ఇంత క్రూరంగా మారిపోతే బ్రతకడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. అవును మరి నేటి రోజుల్లో వెలుగులోకి ప్రస్తుత ఘటనలు కూడా అలాగే ఉన్నాయి. ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మన దేశంలో ఎక్కడంటే అక్కడ మూత్ర విసర్జన చేయడం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది.


 ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎక్కడికక్కడ మూత్రశాలలు  ఏర్పాటు చేసినప్పటికీ అటు జనాలలో మాత్రం మార్పు రావడం లేదు. కాస్త ఖాళీ ప్లేస్ కనిపించింది అంటే చాలు ఎంతోమంది అక్కడే పని కానిచ్చేస్తున్నారు. ఒకే గోడపై మూత్ర విసర్జన చేయడం ఒక వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. గోడపై మూత్రం పోస్తావా అంటూ సదరు వ్యక్తితో ఘర్షణకు దిగిన నలుగురు వ్యక్తులు చివరికి పట్టపగలు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ దారుణమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి రావడం గమనార్హం.


 మయాంక్ అనే యువకుడు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తున్నాడు. ఇటీవల మధ్య ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మూత్ర విసర్జన చేశారు. ఇంటి గోడలపై మూత్రం పోయడాన్ని గమనించిన యజమానురాలు అభ్యంతరం వ్యక్తంచేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఒకరిపై ఒకరు చేయి కూడా చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆమె కుమారుడు మనిష్ తన స్నేహితులకు విషయం చెప్పి అతని పట్టుకునేందుకు వెంటనే పరుగులు పెట్టారు. మాలవీయ నగర్ లోని ఓ ప్రాంతంలో అతనిని అడ్డగించి దారుణంగా పొడిచి చంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు  నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: