విధి అందరి విషయంలో ఒకేలా ఉండదు. కొంతమందికి ఊహించిన రీతిలో పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలోని అంత ఆనందంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొన్ని కొన్ని విషాదకర ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఓ మహిళ జీవితంలో ఇలాంటిదే జరిగింది   దాంపత్య జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది అని ఆనంద పడింది ఆ మహిళ. కానీ నూరేళ్ల వైవాహిక జీవితం కాస్త అడవి కాసిన వెన్నెలగా మారిపోయింది. విధి చిన్నచూపు చూడటం కారణంగా అయిదోతనాన్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది సదరు మహిళ. ఇంతటి దుఃఖంలో కూడా ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.



 కట్టుకున్న వాడి రుణం తీర్చుకోవాలి అని భావించిన సదరు మహిళ ఏ ఆడది చేయని గొప్ప పని చేసింది అని చెప్పాలి. ఏకంగా దగ్గరుండి భర్తకు అంతిమ సంస్కారాలు నిర్వహించింది.. అంతేకాదు తాళి కట్టిన భర్తకు అన్ని తానై తలకొరివి పెట్టింది సదరు మహిళ. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికులనే కంటతడి పెట్టించింది అని చెప్పాలి. కరీంనగర్ లోని శంకరా పట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన చల్లూరి పోచయ్య కొమరమ్మ దంపతులు జీవిస్తున్నారు. కాగా పోచయ్య గ్రామపంచాయతీలో సఫాయిగా పని చేస్తూ ఉంటాడు.


 విరికి పిల్లలు పుట్టలేదు. దీంతో ఒక్కరికి ఒకరు తోడు నీడగా ఉన్నారు అన్నట్లుగానే అన్యోన్యమైన దంపతులుగా ఉన్నారు.  అప్పటికే పిల్లలను ఇవ్వకుండా వీరిని నిరాశలో ముంచేసిన విధి.. పిల్లలు లేకుండా వీరు ఆనందంగా ఉండడని చూసి ఓర్వలేకపోయింది. దీంతో పోచయ్యను మృత్యువు ఒడిలోకి చేర్చింది. అయితే వీరికి సంతానం లేకపోవడంతో ఇక దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ లేకుండా పోయారు. ఈ క్రమంలోనే భర్త మరణంతో  దుఃఖంలో మునిగిపోయిన భార్య కొమురమ్మ హిందూ సంప్రదాయం ప్రకారం భర్తకు అంతిమ సంస్కారం నిర్వహించింది. భర్త చితికి నిప్పు పెట్టి వీడ్కోలు పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: