పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఈ క్రమంలోనే ఈ ప్రత్యేకమైన క్షణాల్ని మరింత గుర్తుండి పోయేలా చేసుకునేందుకు నేటి రోజుల్లో యువతి యువకులు సరికొత్తగా ఆలోచిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు పెళ్లి తర్వాత మొదటి రాత్రి అని ఒక రోజు నిర్ణయించి ఆరోజు మాత్రమే ఇక వధూవరులు ఇద్దరు కూడా కలుసుకునేందుకు అవకాశం కల్పించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పెళ్లిలలో వివాహ వేడుక పైన వధూవరులు ముద్దులతో రెచ్చిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్.


 ఇక అక్కడికి వచ్చిన బంధుమిత్రులు కూడా కాలం మారింది. కాలంతో పాటే మనం కూడా మారాలి కదా అంటూ ఇక ఇలాంటివి చూసినప్పుడు సర్దుకుపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా వరుడు ఒకవేళ ముద్దు పెట్టాడు అంటే పక్కనే ఉన్న వధువు సిగ్గుపడటం లాంటివి ఇప్పటివరకు చూసామ్. కానీ ఇక్కడ వధువు మాత్రం అలా చేయలేదు. వరుడు సరదాగా ముద్దు పెట్టడంతో బహిరంగంగా ఎలా ముద్దు పెడతావ్ అంటూ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వరుడికి షాక్ ఇచ్చింది.


 ఇలాంటి వరుడు తనకు వద్దే వద్దు అంటూ మొండికేసింది సదరు యువతీ. ఎవరు ఎంత చెప్పినా వినకపోవడం.. పోలీసులు సర్ది చెప్పిన ఆమె కాంప్రమైజ్ కాకపోవడంతో పోలీసుల సైతం చేతులెత్తేసారూ. చివర్లో వరుడు పెద్ద ట్విస్ట్ ఇవ్వడంతో ఈ పెళ్లి మరింత చర్చనీయాంశంగా మారింది. బాదాయి జిల్లాకు చెందిన అమ్మాయి సాంబాల్ జిల్లా పవాసకు చెందిన అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. వధూవరులు దండలు మార్చుకున్న సమయంలో వరుడు కాస్త కొంటెగా ప్రవర్తించాడు. వధువును అందరి ముందే ముద్దు పెట్టుకున్నాడు. దీంతో వధువు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే చివరిలో వరుడు ట్విస్ట్ ఇచ్చాడు. తాను కావాలని ముద్దు పెట్టలేదని.. వధువు తనతో చాలెంజ్ చేసిందని.. ముద్దు పెడితే 1500 ఇస్తానని లేదంటే నువ్వు 3000 ఇవ్వాలంటూ బెట్ కట్టడంతోనే ముద్దు పెట్టినట్లు  వరుడు చెప్పగా.. తానేమి అలాంటి బెట్ వేయలేదని వధువు చెప్పింది. దీంతో కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకోవాలని సలహా ఇచ్చారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: