ఇటీవల కాలంలో ఎంతోమంది విద్యార్థులు తెలిసి తెలియని వయసులో చేస్తున్న సరదా పనులు చివరికి పక్కవారి ప్రాణాలు మీదికి తెస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపవద్దు అని అటు ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా ఎందుకో ఎంతో మంది తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలకు వాహనాలు ఇస్తూ రోడ్లమీదకి పంపిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక ఎన్ని జరిమానాలు విధించిన ఇలా వాహన యజమానుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి.


 సాధారణంగా ఇప్పటివరకు మైనర్లుగా ఉన్న ఎంతోమంది బాలురు ద్విచక్ర వాహనాలను తీసుకొని రోడ్ల మీదికి రావడం చూసాము. ఇక కొన్ని కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాల పడుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రమైన ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హాస్పిటల్లో ఉండే అంబులెన్స్ తీసుకొని పారిపోయాడు. 8 కిలోమీటర్ల వరకు కూడా అంబులెన్స్ డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు అని చెప్పాలి. కాగా మైనర్ అంబులెన్స్ డ్రైవ్ చేయడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


 దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగం లోకి దిగారు. ఈ క్రమం లోనే అంబులెన్స్ నూ నడుపుకుంటూ వెళ్తున్న ఇక ఆ విద్యార్థి వాహనాన్ని వెంబడించారు పోలీసులు. చివరికి వాహనాన్ని అతి కష్టం మీద అడ్డుకొని అంబులెన్స్ డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. విద్యార్థి తండ్రి అదే ఆసుపత్రిలో ఉద్యోగిగా ఉండడంతో సరదాగా ఇక పదవ తరగతి విద్యార్థి అంబులెన్స్ డ్రైవింగ్ చేయడానికి తీసుకెళ్లాడు అన్న విషయాన్ని గుర్తించారు పోలీసులు. ఈ ఘటన కేరళలోని తీన్పూర్లో వెలుగులోకి వచ్చింది. గడ్డంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: