
ఈ క్రమంలోనే మొక్కులు చెల్లించుకుంటున్నాం అనే పేరుతో కొంతమంది వ్యక్తులు చేసే పిచ్చి పనులు కాస్త ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. సాధారణంగా ఆరోగ్యం బాగా లేనప్పుడు దేవుడిని మొక్కడం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆరోగ్యం నయం అయితే తలనీలాలు సమర్పిస్తాను అంటూ మొక్కుకోవడం చూసాము. కానీ ఇక్కడ మాత్రం ఓ యువకుడు అలా చేయలేదు. ఏకంగా తలనీలాలు డబ్బు బంగారం లాంటి కానుకలను సమర్పించడం కాదు ఏకంగా తన నాలుకను దేవుడికి సమర్పించాడు..
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వీరేష్ అనే యువకుడు దేవుడికి నాలుకను సమర్పించాడు. ఏకంగా నాలుకను కోసి ఇచ్చేసాడు. కొన్ని రోజుల నుంచి వీరేష్ తాత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. తాత అంటే వీరేష్ కి ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే తాత త్వరగా కోలుకోవాలని ఆలయంలో పూజలు చేశాడు. ఈ క్రమంలోనే కానుకలు సమర్పించడానికి బదులు కత్తితో తన నాలుక కోసి సమర్పించాడు. గ్రామస్తులు గమనించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని మానసిక స్థితి సరిగ్గా లేదని అటు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.