ఇటీవల కాలం లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వినియోగిస్తున్నారు. ఈ క్రమం లోనే అందరికీ కూడా ఇంటర్నెట్ అందుబాటు లోకి వచ్చింది. ఇక ఇంటర్నెట్లో ఎంటర్టైన్మెంట్ పంచడానికి తమ స్నేహితులతో సరదాగా మాట్లాడు కోవడానికి ఎన్నో రకాల యాప్స్ అందుబాటు లో ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలం లో ఎక్కువ ఆదరణ పొందుతున్న యాప్ ఏదైనా ఉంది అంటే అది ఇంస్టాగ్రామ్ అని చెప్పాలి. ఇంస్టాగ్రామ్ లో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోడానికే అటు జనాలు ఇష్ట పడుతున్నారు.


 అంతే కాదు కొంత మంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ద్వారా కూడా పాపులారిటీ సంపాదించుకున్న వారు ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలం లో కేవలం మంచి విషయాలను మాత్రమే కాదు చెడు విషయాలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమం లోనే కొంత మంది ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వారు సోషల్ మీడియా లో లైవ్ పెట్టి తాము చనిపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పి ఆత్మహత్య చేసుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం.


 ఇలాగే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న ఒక వ్యక్తి ప్రాణాలను చివరికి ఇన్స్టాగ్రామ్ కాపాడింది అని చెప్పాలి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు లోకి వచ్చింది. ఘజియాబాద్కు చెందిన అభయ్ శుక్ల అనే యువకుడు వ్యాపారం లో నష్టపోవడం తో మనస్థాపానికి గురి అయ్యాడు. ఈ క్రమం లోనే బలవన్మరణానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఇక ఇంస్టాగ్రామ్ లో ఆత్మహత్య చేసుకునే ముందు లైవ్ పెట్టాడు. అయితే వెంటనే అప్రమత్తమైన ఇంస్టాగ్రామ్స్ సిబ్బంది.. అతని ఫోన్ నెంబర్ తో పాటు లోకేషన్ ని స్థానిక పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి 13 నిమిషాల్లో అతను ఆచూకీ పట్టుకొని చివరికి అతని ప్రాణాలను కాపాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: