
గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన అలేఖ్య దొంగ నోట్ల తయారు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతని ఇంటిపై దాడులు నిర్వహించి ఇక దొంగ నోట్లు తయారు యంత్రాన్ని దొంగ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అలేఖ్య ఇంటిపై నుంచి దూకడంతో కాలు విరిగింది. ఇక అతనికి వైద్య చికిత్సలు పోలీసుల ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే దొంగ నోట్లు తయారీలో భాగస్వామ్యం ఉన్న మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పాలి.
ఇక ముగ్గురు నిందితులని గురజాల సబ్ జైలుకి గాయపడిన అలేఖ్యను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటి నుంచి గుంటూరు, గురజాల ప్రభుత్వాసుపత్రిలో అలేఖ్య చికిత్స పొందుతూ ఉన్నాడు. అతనికి నలుగురు ఎఆర్ కానిస్టేబుల్ లను ఎస్కార్ట్ గా ఉంటున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వాసుపత్రి నుంచి అలేఖ్య పోలీసుల కళ్ళు కప్పి వీల్ చైర్ తో పారిపోయాడు. ఆస్పత్రి పరిసరాల్లో సిసి కెమెరాలు కూడా లేకపోవడంతో నిందితుడు ఎలా తప్పించుకున్నాడో కూడా పోలీసులకు అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే కుటుంబ సభ్యులు స్నేహితుల సహాయంతో పరారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక పరారైన నిందితుడు గురించి ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు అని చెప్పాలి.