ఇటీవల కాలంలో వైద్యరంగంలో అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెక్నాలజీతో వైద్య రంగంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అనే విధంగానే మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే అందుబాటులోకి వచ్చిన అధునాతనమైన వైద్య సదుపాయాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు.. ఎన్నో జబ్బులను నయం చేసుకుంటున్నారు.


 మరి కొంతమంది ఇలా వైద్యరంగంలో వచ్చిన మార్పులను బాగా వాడుకుంటూ ఏకంగా ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఉన్న అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడం చేస్తూ ఉన్నారు. ఎక్కువగా సినీ సెలబ్రిటీలు, మోడల్స్ ఇలా ప్లాస్టిక్ సర్జరీ లనే ఆశ్రయిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. అయితే మరి కొంతమంది మాత్రం ఇలా వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అధునాతన సదుపాయాలను  వాడుకొని దారుణాలు కూడా పాల్పడుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఏకంగా చిన్నపిల్లల అవయవాలు తొందరగా పెరిగేలా కొంతమంది హార్మోన్ ఇంజక్షన్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తున్నారు  . ఇక్కడ ఒక తల్లి ఇలాంటి నీచానికి పాల్పడింది అని చెప్పాలి. విజయనగరంలో కూతురిని హీరోయిన్ చేయాలని భావించిన తల్లి ఏకంగా కూతురికి హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చింది. అయితే ఈ ఘటన బయటికి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సదరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ విషయం చెప్పింది.కూతురు హీరోయిన్లా ఉందంటూ తనతో చుట్టుపక్కల వారు చెబుతూ ఉండేవారు. ఇక ఆ మాటలు విన్న తర్వాత పదో తరగతి చదివే కూతురు అవయవాలు త్వరగా పెరిగేందుకు హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకుంది మహిళ. అయితే హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలోనే తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇక తల్లిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: