
ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మద్యానికి బానిసైనా ఒక వ్యక్తి చివరికి కుటుంబ సభ్యులకు గురించి ఆలోచించకుండా.. ఇక క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇక కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతాన్ పల్లి లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవళ్ళ నర్సింలు అనే 28 ఏళ్ల యువకుడు.. ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే ఇలా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అతను మద్యానికి బానిసగా మారిపోవడమే అన్నది తెలుస్తుంది. నర్సింలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో పనిచేయడం మానేసి ఇక మద్యానికి బాగా అలవాటు పడిపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మద్యం తాగడం కోసం తన తల్లిని వెయ్యి రూపాయలు అడిగాడు నర్సింహులు. అయితే తల్లి మాత్రం తన దగ్గర లేవు అని చెప్పడంతో.. తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నర్సింలు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.