ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అసలు మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకప్పటిలా మనిషి మూఢనమ్మకాల ఊబిలో బ్రతకడం లేదు. నాగరికత జీవితంలోకి అడుగు పెట్టి టెక్నాలజీకి అనుగుణంగా ఇక జీవనశెలలో మార్పులు చేసుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే అంతా బాగానే ఉంది. కానీ ఇక నాగరికత జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత మనిషిలో ఆలోచించే విచక్షణ మాత్రం రోజు రోజుకు తగ్గిపోతుందేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా సమస్య వచ్చిన ఎంతో ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే వాడు మనిషి.


 అంతేకాదు ఇక వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించాలో అని ఎంతో విచక్షణతో ఆలోచిస్తూ మనిషి అనే పదానికి అసలైన అర్థం చెప్పేవాడు. కానీ ఇటీవల కాలంలో మాత్రం కొంతమంది జనాలు ఆలోచిస్తున్న విధానం ప్రతి ఒక్కరిని కూడా షాక్ అయ్యేలా చేస్తుంది. ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అన్న విధంగా ప్రతి ఒక్కరి ఆలోచన తీరు మారిపోయిందేమో అనే భావన అందరిలో కలుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే విచక్షణ లేమిటో ఆలోచిస్తున్న ఎంతోమంది ఇక క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 ఇటీవల హైదరాబాద్లోని బోరబండలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి కొనిచ్చిన ఫోన్ పోయిందని భయపడిపోయాడు సాయికుమార్ అనే 21ఏళ్ళ యువకుడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో ఒక ఫోన్ కొనివ్వగా అది పోగొట్టుకున్నాడు. అనంతరం ఈఎంఐ లో తండ్రి మరో ఫోన్ కొనిచ్చాడు. అది కూడా పోవడంతో తండ్రి ఏమంటాడో అని భయపడి చివరికి రైలు కిందపడి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ ఘటనతో తల్లిదండ్రులు అరణ్య రోదనగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: