ప్రేమ పెళ్లి మంచిదా లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా? ఎలా పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండగలం.. అని నేటి రోజుల్లో యువత ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అది లవ్ మ్యారేజ్ అయిన లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే పెళ్ళికి దూరంగా ఉండటమే బెటర్. పెళ్లి చేసుకోకపోతేనే ఎంతో సంతోషంగా ఉండగలం అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎక్కడ కనిపించడం లేదు.


 పెళ్లయిన కొన్నాళ్లపాటు ఏకంగా ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న భార్యాభర్తలు ఆ తర్వాత వివిధ కారణాలతో చివరికి గొడవలు పడుతూ విడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు.. చివరికి దారుణంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇలాంటివి చూసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది.


 ఇలాంటి తరహా ఘటనే ఇక్కడ వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. జనగాం కు చెందిన బొడ్డు శ్రవణ్ కుమార్ అనే 23 ఏళ్ల యువకుడు అయిదు నెలల క్రితం మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతికి చెందిన సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహం కావడంతో పెళ్లయిన తర్వాత జీవితం సంతోషంగా సాగిపోతుంది అని భావించాడు. ఇక ప్రస్తుతం ఈ దంపతులు హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో సాయి నగర్ లో ఉంటున్నారు. ఇటీవల పండుగ నేపథ్యంలో అత్తారింటికి వచ్చాడు శ్రవణ్. అయితే అత్తారింట్లో అటు భార్యకు భర్తకు మధ్య పూల విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన శ్రావణ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: