సాధారణం గా ప్రతి మనిషి జీవితంలో గొడవలు అనేది సహజం. కొన్ని కొన్ని సార్లు ఇంట్లో వాళ్లతో ఇంకొన్నిసార్లు పోరుగంటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో గొడవలు జరిగితే.. అయితే ఇలా ఒక్క గొడవ కూడా జరగకుండా ఏ మనిషి ఉండలేడు అని చెప్పాలి. అయితే చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు కొంతమంది సర్దుకు పోతే ఇంకొంతమంది మాత్రం గొడవను మరింత పెద్దది చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఒకవేళ ఎదురింటి వారితో గొడవ జరిగితే.. ఎవరైనా ఏం చేస్తారు? ఆ ఇంటికి వెళ్లడం మానేస్తారు. అంతే కాదు ఇక ఎదురింటి వారితో మాటలు కూడా ఆపేస్తారు. అంతే కాదు వారి గురించి ఇతరులకు చెడుగా చెప్పడం కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఎదురింటి వారితో గొడవలు జరిగినప్పుడు ఎవరైనా ఇలాంటిదే చేస్తారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అచ్చం ఇలాగే ఎదురింటి వారితో గొడవ జరిగితే.. చేసిన పనికి అందరూ షాక్ అయ్యరు. ఏకంగా ప్రభుత్వ రోడ్డుపై గోడ కట్టేసాడు సదరు వ్యక్తి. ఇక అతను చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. ఏపీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.



 పల్నాడు జిల్లాలోని శావల్యాపురం మండలం లో కారుమంచి లో ఇది జరిగింది. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ ఇళ్ళు ఎదురెదురుగా ఉన్నాయి. అయితే వీరికి అసలు పడేది కాదు. చాలా సార్లు విభేదాలు కూడా తలెత్తాయి. ఇక ఊరి పెద్దల వద్ద పంచాయతీ కూడా జరిగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ ఏకంగా చంద్రశేఖర్ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడలేదు. దీనికోసం తన ఇంటి ఆవరణలో గోడ కట్టుకోకుండా.. ఏకంగా ప్రభుత్వం వేయించిన సీసీ రోడ్డు మధ్యలో గోడ కట్టాడు  దీంతో అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: