మనదేశంలో మోడ్రన్ సిటీ ఏది అంటే బెంగళూరు పేరును చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక దేశంలోని మిగతా నగరాలతో పోల్చి చూస్తే బెంగళూరు మాత్రం అభివృద్ధిలో అన్నింటికంటే ముందు స్థానంలో ఉంది అని చెప్పుకునేవారు. ఈ క్రమంలోనే ఇక ఉద్యోగం వ్యాపారం నిమిత్తం ఎంతోమంది ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉండేవారు అని చెప్పాలి. ఒకవేళ ఎవరైనా బెంగుళూరులో సెటిల్ అయ్యారు అంటే చాలు వారిని గొప్పగా చూడటం చేసేవారు మిగతా జనాలు. అయితే ఇక ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. బెంగళూరులో నివసించే జనాల పరిస్థితి అద్వానంగా మారిపోయింది.


 ఈ సిటీని వదిలి ఎక్కడికైనా వెళ్తే ప్రశాంతత దొరుకుతుందేమో అనే విధంగా అక్కడి వారి పరిస్థితి మారిపోయింది   దీనికి కారణం అక్కడ నేలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడి. ఏకంగా రోజువారి అవసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో ఇక ఆచీ తూచి వాడుతూ నీటి ఎద్దడితో తీవ్రమైన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఒకప్పుడు బెంగళూరులో సెటిల్ అయిన వారికి పిల్లను ఇవ్వాలని ఎంతోమంది అమ్మాయిలు తల్లిదండ్రులు అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం బెంగుళూరు యువతకు పెళ్లి కష్టాలు కూడా వచ్చేశాయ్.


 ప్రస్తుతం బెంగళూరులో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడి తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో  అక్కడ దుర్భర స్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అనేక కొత్త సమస్యలను ఈ నీటి ఎద్దడి తెచ్చిపెడుతుంది. అయితే అక్కడి అబ్బాయిలకు కనీసం పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు కూడా ముందరకు రావడం లేదట. ఓ ఐటీ ఉద్యోగి ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మొర పెట్టుకున్నాడు. ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ నీటి సమస్యను పరిష్కరించాలి అంటూ కోరాడు. నీటి సమస్య కారణంగా కనీసం తమకు పిల్లనివ్వడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు అంటూ సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. కాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: