కరోనా వైరస్ ప్రకంపనకు సృష్టించిన సమయంలో అన్ని దేశాలు కూడా వ్యాక్సిన్ పై ఎంతలా ఆధారపడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా.. ప్రతి ఒక్కరు ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పనిసరిగా ఈ కరోనా టీకాలు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి అనే విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఏకంగా భారత్ లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉపయోగించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపడ్డాయి.



 కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయని.. రక్తం గడ్డ కట్టడంతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. విపరీతమైన తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అంటూ ఇటీవల కోర్టులో ఆస్ట్రాజనక కంపెనీ తెలిపింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే ఇక కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకోవడం కారణంగానే తమ కుమార్తె చనిపోయింది అంటూ ఇటీవలే ఓ యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజనికాపై దావా వేయాలని నిర్ణయించుకున్నారు.


 2021 లో 20 ఏళ్ల కూతురు కారుణ్యను కోవిషీల్డ్ వాక్సిన్ కారణంగా కోల్పోయామని.. వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించారు. జూలై 2021 లో కారుణ్య వేణుగోపాల్ అనే 20 ఏళ్ల స్టూడెంట్ టీకా తీసుకున్న నెల రోజుల తర్వాత మనం రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత.. ఆమె మల్టీ సిస్టం ఇన్ ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె తీవ్రమైన సమస్యల బారిన పడింది. ఇక నెల తర్వాత చివరికి ప్రాణాలు కూడా కోల్పోయింది అంటూ ఆమె తండ్రి వేణుగోపాల్ గోవిందన్  చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఆమె పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రజారోగ్యం పేరుతో జరిగిన దురాగతం పునరావృతం కాకుండా నిరోధించడానికి తమ కుమార్తె మరణానికి  కారణమైన వారిపై కేసు చేస్తామని గోవిందన్ దంపతులు తమ కుమార్తెల మరణాలపై విచారణ జరిపాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: