ఇలాంటి ఘటనలను చూసి మనిషి జీవితం నిజంగా దేవుడు చేతిలో కీలుబొమ్మలాంటిదే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో.. ఊహించని రీతిలో ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు రెప్పపాటు కాలంలో మృత్యువు కబళిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ జరిగింది నిజమేనా అని కళ్ళతో చూసిన వారు కూడా నమ్మశక్యం కాని విధంగా ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.
తల్లితోపాటు ఎంతో సంతోషంగా చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. కానీ ఆ చిన్నారి సంతోషాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. దీంతో ఊహించని రీతిలో ఆ చిన్నారి ప్రాణాలు తీసేసింది. మహారాష్ట్రలోని ముబ్రాలో విషాదం చోటుచేసుకుంది. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మూడేళ్లు చిన్నారిపై.. 5 అంతస్తుల భవనం నుంచి ఒక కుక్క పడింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కుక్కను ఎవరైనా కావాలని కిందికి విసిరేసారా.. లేకపోతే అదే పడిందా అనే కోణంలో ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.