జిల్లెలగూడకు చెందిన గురుమూర్తి జనవరి 15న, సరిగ్గా సంక్రాంతి రోజున తన భార్య వెంకటమాధవిని హత్య చేసి, ఆపై స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. హత్యకు సంబంధించి అతని స్నేహితుడిని కూడా పోలీసులు విచారణకు పిలిచినట్లు సమాచారం. గురుమూర్తి తన భార్యను హత్య చేసిన తర్వాత 8 సార్లు కాల్‌లు చేశారని, అందులో ఒకటి బడంగ్‌పేటలో ఉంటున్న తన సోదరికి చేసినట్టు కాల్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. అనేక మలుపులు తరువాత తాజాగా గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.
ఇక పోలీసుల దర్యాప్తులో నేరస్తుడు గురుమూర్తి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. గురుమూర్తి కొలీగ్స్ గురుమూర్తి గురించి చాలా పాజిటివ్ గా స్పందించడం కొసమెరుపు. గురుమూర్తి చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, అనవసరంగా ఒకరితో గొడవలు పడే రకం కాడని వెల్లడించారు. భోజనం కేవలం స్టీల్ ప్లేట్స్ లోనే తింటాడని, ప్లాస్టిక్ అస్సలు వాడడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అనవసర స్నేహాలు చేయడని, ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాడని అన్నారట. దాంతో ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.