గత కొన్ని రోజులుగా  కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ధర్మస్థలి అనే ప్రదేశం గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ధర్మస్థలి సమీపంలోని వివిధ ప్రదేశాల్లో వందలాది మంది శవాలు  ఉన్నాయని ఒక కార్మికుడు చెప్పడంతో  పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మరి ధర్మస్థలంలో నిజంగానే శవాలు ఉన్నాయా.. అసలు విషయం ఏంటి అనే వివరాలు చూద్దాం.. ఇప్పటికే ధర్మస్థలి లో సిట్ ఆధ్వర్యంలో  తవ్వకాలు స్టార్ట్ చేశారు. మొదటి నాలుగు రోజులు ఒక్క శవం కూడా దొరకలేదు. దీంతో చాలామంది ఇదంతా ధర్మస్థలి ప్రాచుర్యం తగ్గించడానికి చేశారని భావించారు. కానీ నాలుగవ రోజున ఉన్నట్టుండి నాలుగు శవాల అవశేషాలు దొరకడంతో అందరూ షాక్ అయిపోయారు. 

అంతేకాదు మరిన్ని శవాలు దొరికే అవకాశం ఉందని అధికారులు భావించి తవ్వకాలు ముమ్మరం చేశారు. ఇందులో 2012లో సౌజన్య, 2003లో  అనన్య భట్ వీరిద్దరు టెంపుల్ లోపలికి వెళ్లి ఇక బయటకు రాలేదు. అసలు ఎక్కడికి వెళ్లారు.. ఇప్పటివరకు కూడా సమాచారం లేదు. వీళ్లే కాకుండా వేదవల్లి అనే అబ్బాయి. దీంతో నాగరిక సేవా సంస్థ అనే వారు ఆర్టిఐ ద్వారా ఒక అప్లికేషన్ ఇచ్చారు. అసలు ధర్మస్థలిలో అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారని వారు ప్రశ్నించారు. ధర్మస్థలి సమీపంలో మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ధర్మస్థలి, రెండవది హెస్డే, 3వది బేతంగడి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి.

పోలీస్ స్టేషన్లలో 456 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని,ఇందులో 96 మంది మహిళల మిస్సింగ్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ధర్మస్థలి గురించి మాట్లాడిన జర్నలిస్టులను ఇతర వ్యక్తులను చంపేశారు. నిన్న మొన్న ప్రశ్నించిన ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేయించారు. ఇక్కడ ఏం జరుగుతోంది.. అసలు ధర్మస్థలలో జరిగేది ఏంటి అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంది. కాబట్టి ఈ విషయంలో రాబోవు రోజుల్లో ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: