
దాని వల్ల రష్యా ఎలాగైనా తన ఆధీనంలోకి తీసుకోవడానికి కొత్త ప్రణాళికలు వేసుకుంది. డోనెట్స్ కు ఎంట్రన్స్ పార్ట్ అయినా బాగ్ పుత్ ప్రాంతాన్ని రష్యా కకావికాలం చేసేసింది. ఈ బాగ్ పుత్ ప్రాంతాన్ని గులాబీల నగరంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని దక్కించుకుంటే కేర్సన్ దక్కొచ్చు. బాగ్ పుత్ ప్రాంతం అనేది ఉక్రెయిన్ లోకి చాలా కీలక భాగం.
అది దక్కితే ఉక్రెయిన్ ను ఈజీగా స్వాధీనం చేసుకోవచ్చని రష్యా భావించి ఇన్ని రోజులు బాగ్ పుత్ పై దాడులు చేస్తూ దాదాపు 20 వేల మంది రష్యన్ సైనికుల్ని కోల్పోయింది. అంటే అది ఎంత కీలక ప్రాంతమో అర్థం చేసుకోవచ్చు. దాదాపు బాగ్ పుత్ ప్రాంతంలోనే 20 వేల మంది రష్యన్ సైనికులు మరణించారంటే ఎంతటి భీకర యుద్ధం జరిగిందో తెలుసుకోవచ్చు.
బాగ్ పుత్ పూర్తిగా స్వాధీనం చేసుకున్న సందర్భంగా వ్యాగనర్ చీఫ్ అధినేతకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపారు. ఒక అవార్డు ప్రకటించారు. అక్యుంబస్ అని బిరుదును ఇచ్చారు. అక్యుంబస్ అంటే విజేత అని అర్థం. బాగ్ పుత్ పూర్తిగా స్వాధీనం కావడం వల్ల రష్యా సంబరాలు చేసుకుంటోంది. యుద్ధం ప్రారంభం కాక ముందు ఈ బాగ్ పుత్ ప్రాంతంలో దాదాపు లక్ష మందికి పైగా జీవించే వారు. ప్రస్తుతం 4 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది.