రాజకీయాల్లో ఒక పార్టీ వాళ్ళని మరొక పార్టీ వాళ్లు విమర్శించుకోవడం అత్యంత సహజం. ఆ విమర్శలు కూడా చాలాసార్లు ఘాటుగానే ఉంటాయి. అయితే ఈ రాజకీయ నాయకులు  వాళ్లలో వాళ్లు ఒకరినొకరు విమర్శించుకోవడం వరకు ఓకే. కానీ వాళ్ల సంభాషణల లోకి అవతలి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రస్తావిస్తూ  ఉంటారు. రాజకీయాల్లో పక్కవారిని టార్గెట్ చేయడానికి వారి ఇంటి మహిళల గురించి ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారు.


ఈ విధానం సమంజసం కాదని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి వైసిపి వాళ్ళు ప్రత్యేకంగా విమర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారంటూ ప్రత్యర్ధి పార్టీ వాళ్ళ భావన. గతంలో కూడా చంద్రబాబు నాయుడు సతీమణి గురించి అంబటి రాంబాబు, అలానే ద్వారంపూడి వీళ్ళు కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


అలాగే ముఖ్యమంత్రి జగన్ సతీమణిని కూడా ఇదేవిధంగా విమర్శించిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎవరు ఎవరి భార్యను విమర్శించారు అన్నది కాదు పాయింట్, ఎందుకు వీళ్ళ సంభాషణలోకి పక్క వాళ్ళ కుటుంబ సభ్యులను, అది కూడా ఆడవాళ్ళని తీసుకువస్తున్నారు అనేదే పాయింట్. ఇక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే. అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా విమర్శించడం సమంజసం కానే కాదు అంటున్నారు సామాజిక వేత్తలు.


మొన్న పవన్ కళ్యాణ్ తన భార్యను విమర్శించారని బాధపడడం మనం చూసాం. కానీ ఆయన వాలంటీర్ల పై చేస్తున్న ఆరోపణల వల్ల వాలంటీర్ల భార్యలు కూడా అదే విధంగా బాధపడతారు కదా అని అడుగుతున్నారు కొంతమంది. ఎవరో ఒకరిద్దరూ చేసిన తప్పులు వల్ల మొత్తం వాలంటీర్ వ్యవస్థనే రద్దు  చేయిస్తాం అనడం ఎంతవరకు సమంజసం అని పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నారు మరి కొంతమంది.


మరింత సమాచారం తెలుసుకోండి: